తెలుగు మేకర్స్ చాలా గొప్ప.. వారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది : ఇమ్రాన్ హస్మి

by Kavitha |   ( Updated:2024-02-14 07:34:52.0  )
తెలుగు మేకర్స్ చాలా గొప్ప.. వారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది : ఇమ్రాన్ హస్మి
X

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మన టాలీవుడ్‌ని ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్లింది. దీంతో ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ గురించి అది కూడా ముఖ్యంగా టాలీవుడ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి చర్చలు సాగుతున్నాయి. ఇక ఈ దెబ్బకు బాలీవుడ్ సినిమాలు వెనక పడుతూ వచ్చాయి. దీంతో చాలా మంది బాలీవుడ్ సెలబ్రేషన్ తెలుగు సినిమాలను పొగడడం మొదలు పెట్టారు.ఇందులో భాగంగా తాజాగా మరో బాలీవుడ్ హీరో కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించాడు.

సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మి విలన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఇమ్రాన్ కి సంబంధించి చాలా వరకు షూట్ అయిపోయినట్లు టాక్.అయితే తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘సౌత్ సినిమా చేస్తున్నారు కదా మరి సౌత్ – బాలీవుడ్ మధ్య తేడా ఏంటి’ అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ ‘సౌత్ ఫిలిం మేకర్స్ బాలీవుడ్ వారి కన్నా కూడా చాలా క్రమశిక్షణగా ఉంటారు. బాలీవుడ్ లో సినిమా విషయాల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కొన్ని సార్లు అవసరం లేని చోట కూడా ఖర్చు పెడతారు. కానీ సౌత్ వారు అలా కాదు. వారు ఖర్చు పెట్టే దాంట్లో ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఖర్చు చేసిన డబ్బులు సినిమా రూపంలో కనిపిస్తాయి. VFX, పాత్ బ్రేకింగ్ కథల విషయంలో సౌత్ దర్శకులు మనకంటే ముందు ఉన్నారు’ అంటూ ప్రశంసించారు. దీంతో ఇమ్రాన్ హష్మీ కామెంట్స్ ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లో వైరల్ అవుతూ చర్చకు దారి తీశాయి.



Next Story

Most Viewed