మొగలిరేకులు సీరియల్ నటుడు మృతి.. ఈ బాధను వర్ణించలేకపోతున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-03-04 07:49:42.0  )
మొగలిరేకులు సీరియల్ నటుడు మృతి.. ఈ బాధను వర్ణించలేకపోతున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ ఒకప్పుడు సంచలనం సృష్టించింది. ఈ సిరీయల్ కొన్ని సంవత్సరాల వరకూ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత వచ్చిన చక్రవాకం కూడా మంచి వ్యూస్‌ను రాబట్టింది. ఇందులో నటించిన నటీనటులకు మంచి పాపులారిటీ రావడంతో పాటుగా సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చేలా చేశాయి. తాజాగా, ఈ రెండు సిరీయల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరణవార్త వెలుగులోకి వచ్చి అందరినీ కలిచివేస్తుంది. మొగలిరేకులు, చక్రవాకం సిరీయల్స్‌లో నటుడు ఇంద్రనీల్‌కు తమ్ముడిగా దయ పాత్రలో నటించిన పవీత్రానాథ్ కన్నుమూశాడు.

ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇంద్రనీల్, ఆయన భార్య ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ‘‘ పవి నీకు ఏ బాధ ఎక్కువైందో తెలియదు. కానీ ఈ వార్త విన్నాక మేము అబద్దం అయితే బాగుండని ఆశపడ్డాము. నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచి పెట్టి పోయావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము బ్రదర్ పవి. ఈ బాధను వర్ణించలేకపోతున్నాము. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూడలేకపోతున్నాము. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం.. కానీ ఒకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని అనుకుంటున్నాము.. మేము నిన్ను ప్రేమిస్తున్నాము పవి’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అసలు ఎలా జరిగిందని చర్చించుకుంటున్నారు.

Read More..

‘మొగలిరేకులు’ సీరియల్ నటుడు మృతి.. సంచలన నిజాలు బయటపెట్టిన వైద్యులు!


Next Story

Most Viewed