భారతీయుడు-2 సినిమాకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్

by Satheesh |
భారతీయుడు-2 సినిమాకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వనటుడు కమల్‌హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు-2 మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో భారతీయుడు-2 మూవీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 12 నుండి 19 వరకు మొత్తం వారం రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సినీ సెలబ్రెటీలకు కీలక విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వం వద్దకు వచ్చే సినిమా పెద్దలు.. మూవీల్లో నార్కోటిక్, సైబర్ క్రైమ్స్‌పై ప్రజలకు అవగాహన కలిగించేలా మూడు నిమిషాల వీడియో చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు భారతీయుడు-2 మూవీ యూనిట్‌ నార్కోటిక్, సైబర్ క్రైమ్స్‌‌పై అవగాహన కలిగించేలా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో భారతీయుడు-2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమల్‌హాసన్, శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు స్వీకెల్‌గా భారీ తారాగణంతో తెరకెక్కిన భారతీయుడు-2 మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 12వ తేదీన విడుదల కానుంది. కమల్, శంకర్ కాంబోలో చాలా కాలం తర్వాత వస్తోన్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Next Story

Most Viewed