యోధుడిగా కొత్త సినిమాతో రాబోతున్న తేజ సజ్జా.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ అదుర్స్

by Disha Web Desk 6 |
యోధుడిగా కొత్త సినిమాతో రాబోతున్న తేజ సజ్జా.. ఫస్ట్ లుక్, గ్లింప్స్ అదుర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల హనుమాన్ మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరి ఊహాలను తారుమారు చేసింది. అలాగే హనుమాన్ సినిమాపై ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పలుసార్లు ప్రశంసలు కురిపించడంతో తేజ సజ్జా పాపులారిటీ మరింత పెరిగింది. ఇక హీరోగా చేసిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ అయిపోయాడు. దీంతో అందరి చూపు అతని నెక్స్ట్ సినిమాపైనే పడింది.

తాజాగా, తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ‘మిరాయ్’ సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను నేడు ట్విట్టర్ వేదికగా మేకర్స్ షేర్ చేశారు. ‘ఒక యోధుడి గొప్ప సాహసం’ అనే క్యాప్షన్ జత చేశారు. అశోకుడిని యోగిగా మార్చిన అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. దీంతో అది చూసిన వారంతా తేజ హనుమాన్‌కు మించిన సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని అంటున్నారు.

Next Story

Most Viewed