‘దేవర’ లో తారక్ త్రిపాత్రాభినయం ?

by Kavitha |
‘దేవర’ లో తారక్ త్రిపాత్రాభినయం ?
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్ర పోషిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ‘దేవర’ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? అనే విషయాలన్నింటిని చాలా గోప్యంగా ఉంచుతున్నారు కొరటాల శివ. కానీ చిన్న చిన్న అప్‌డేట్‌ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్తలు బయటకు వచ్చినప్పటి కి దానిపై క్లారిటీ లేదు. కానీ రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌‌లో కాదు ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. దీని బట్టి చూస్తుంటే తారక్ అభిమానులకు ఈ సినిమా కనుల విందుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story