ఆ ఒక్క విషయంలో చరణ్ పద్ధతి అస్సలు నచ్చదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
ఆ ఒక్క విషయంలో చరణ్ పద్ధతి అస్సలు నచ్చదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి బంధం ఉందో మనకు తెలిసిందే. వీరిద్దరూ సొంత అన్నదమ్ముల్లాగే ఉంటారు. ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి అనుబందం ఉంటుంది. నటనలో కూడా ఇద్దరు మంచి టాలెంటెడ్. అయితే అంత క్లోజ్‌గా ఉన్నప్పటికీ చరణ్ అంటే తారక్‌కు ఒక విషయంలో అసలు నచ్చడట. తారక్ తన గురించి పిచ్చిగా వాగిన వారి ముఖంపైనే కొట్టినట్లు మాట్లాడతాడు. కానీ చరణ్ మాత్రం అలా కాదట. ఏదైనా విషయం గురించి తన అభిప్రాయం చెప్పాలనుకున్నా, ఎదుటివారు ఏం అనుకుంటారో అని ఆలోచిస్తాడట. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే మాట్లాడకుండా మనసులో అలాగే పెట్టుకుని బాధపడతాడట. అయితే తారక్ ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా చరణ్ పద్ధతి మార్చుకోట్లేదట. అందుకే ఈ విషయంలో తారక్‌కు చెర్రీ అంటే అస్సలు నచ్చదట.

Next Story