అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నా.. డేటింగ్‌పై తార ఓపెన్

by Disha Web Desk 6 |
అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నా.. డేటింగ్‌పై తార ఓపెన్
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ తారా సుతారియా.. ప్రియుడు ఆదార్ జైన్‌తో రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయింది. కొంతకాలంగా డేటింగ్‌‌లో ఉన్నామని, ఒకరికొకరం ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎప్పుడూ వెనకాడమని చెప్పింది. సోషల్ మీడియాలోనే కాక బహిరంగ ప్రదేశాల్లోనూ సపోర్ట్‌గా ఉంటామన్న తార.. ఇరువురి కుటుంబాలు సైతం సన్నిహితంగానే ఉంటున్నట్లు తెలిపింది. 'నాకు నచ్చిన వ్యక్తులతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తాను. భవిష్యత్‌లో కూడా మేమిద్దరం అదే విధంగా ఉంటామని భావిస్తున్నా.

కాలం గడిచేకొద్దీ చిన్న చిన్న విషయాలు, ప్రత్యేకమైన అవసరాల ప్రాముఖ్యతను అర్థంచేసుకుని సాయం చేసుకుంటున్నాం. అతను ఉదయాన్నే నా కోసం ఒక కప్పు టీ తయారు చేసి ఇచ్చే అనుభూతిని మాటల్లో వర్ణించలేను. తనతో నా ప్రయాణం అద్భుతంగా ఉంది. తనను ఎప్పుడూ గాఢంగా ప్రేమిస్తుంటా. ఎందుకంటే ప్రేమలో ఎప్పటికీ గాఢత్వాన్ని కలిగివుండటం చాలా ముఖ్యం' అంటూ చెప్పుకొచ్చింది తార.

ట్రెండ్ అవుతున్న జాక్వెలిన్ బర్త్‌డే వేడుకలు


Next Story

Most Viewed