Chiranjeevi కంటే ముందే Surekha ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవానుకుంది.. కానీ

by Disha Web Desk 9 |
Chiranjeevi కంటే ముందే Surekha ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవానుకుంది.. కానీ
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంత ప్రత్యేక గౌరవం ఉంటుందో చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది చిరంజీవి. తన నటనతో, మంచితనంతో అలాంటి చెరగని ఓ ముద్ర వేసుకున్నారు మెగాస్టార్. అయితే ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం ఈయన సతీమణి సురేఖనే అని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చిరునే చెప్పాడు. కాగా సురేఖ గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఈమె చిరంజీవి కన్నా ముందే అప్పట్లో స్టార్ హీరోగా పేరు నిలదొక్కుకోన్న ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలనుకుందట. ఆ హీరో నటనన్నా.. వ్యక్తిత్వం పరంగానైనా సురేఖ తండ్రి ‘రామ లింగయ్య’ కు చాలా ఇష్టమట. ఆస్తులు కూడా బాగానే ఉండటంతో ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చెద్దామనుకున్నారట. కానీ ఇద్దరి జాతకాలు కుదరకపోవడంతో వివాహం కాన్సిల్ అయ్యిందట. తర్వాత ఆ లక్కీ ఛాన్స్ మెగాస్టార్ దక్కించుకున్నారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

Read More: 60 ఏళ్ళ వయస్సులో మెషన్ గన్స్ తో సహాసం చేస్తోన్న కమల్ హాసన్.. వైరలవుతోన్న వీడియో!

Next Story

Most Viewed