లండన్‌లో సూపర్ స్టార్ ఫ్యామిలీ.. అతడిని చూస్తే గర్వంగా ఉందంటూ నమ్రత ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
లండన్‌లో సూపర్ స్టార్ ఫ్యామిలీ.. అతడిని చూస్తే గర్వంగా ఉందంటూ నమ్రత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం SSMB షూటింగ్‌లో పాల్గొంటూ టైమ్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య సూపర్ స్టార్ ఫ్యామిలీతో కలిసి లండన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే తన కొడుకు గౌతమ్ కూడా చదుకుతుండటంతో.. అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చని వెళ్లారు. అయితే పలు చోట్ల తిరుగుతున్న ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూనే. ఈ క్రమంలో.. గౌతమ్ రోమియో జూలియట్ నాటకం వేశాడు. ఆ నాటకం చూసిన తర్వాత సూపర్ ఫ్యామిలీ థియేటర్ బయటక ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోలు దిగారు.

వీటిని నమ్రత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘‘ లండన్‌లో గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ ఫర్ఫార్మెన్స్ చూసినందుకు గర్వపడుతున్నాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. నా కొడుకు మరింత బాగా చేశాడు. పిల్లలు అందరూ ఈ సమ్మర్ స్పెషల్ ప్రోగ్రాంకు ఖచ్చితంగా వెళ్ళండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సాయంత్రాన్ని సరదాగా గడిపినందుకు సంతోషంగా ఉంది’’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్‌లో మహేష్ బాబు లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పొడవాటి జుట్టును క్యాప్ పెట్టి కవర్ చేసి స్పెడ్స్ పెట్టి గ్రీన్ కలర్ టీషర్ట్‌లో సింపుల్ లుక్‌తో అందరినీ ఫిదా చేస్తున్నాడు.Next Story

Most Viewed