టాలీవుడ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఈ వారం అగ్రహీరోల సినిమాల అప్‌డేట్స్ ఇవే!

by Anjali |
టాలీవుడ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఈ వారం అగ్రహీరోల సినిమాల అప్‌డేట్స్ ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: అభిమాన హీరోల సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా టాలీవుడ్ అగ్రహీరోల అప్డేట్ ఉందంటే చాలు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎయిట్ చేస్తారు. అయితే, ఈ వారం దాదాపు టాలీవుడ్‌లోని అగ్రహీరోలైన పవన్ కల్యాన్, ప్రభాస్, చిరంజీవి, ఎన్టీఆర్, నాగ చైతన్య సినిమాలతో పాటు పలువురు అనేక మంది సినిమాల అప్‌డేట్స్ ఉన్నాయి.

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ట్రైలర్ మే 9వ తేదీన విడుదల చేయనుండగా, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 11న విడుదల చేయనున్నారు. నాగచైతన్య కస్టడీ సినిమా మే 12న విడుదల చేయనున్నారు. పవన్ కల్యాణ్ మరో మూవీ అయిన ఓజీ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ పూణేలో ప్రారంభం కానుంది. అంతేగాక, చిరంజీవి, రజినీకాంత్, విజయ్ దేవకరొండ, నాని సినిమాల అప్‌డేట్స్ ఉన్నాయి. దీంతో ఈ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

OTT: ఓటీటీ, థియేటర్లో సందడి చేసే తెలుగు, పంజాబీ ,హిందీ సినిమాలివే

Next Story

Most Viewed