రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల.. ఇప్పుడెలా ఉన్నారంటే?

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-01 11:32:17.0  )
రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల.. ఇప్పుడెలా ఉన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital) వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరో రెండ్రోజుల్లో రజినీకాంత్‌ను డిశ్చార్జి చేస్తామని ప్రకటించారు. కాగా, ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన రజినీకాంత్‌ను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త నాళాల్లో ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. నాన్ సర్జికల్ ట్రాన్స్‌క్యాతటర్ విధానంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

గుండెకు సంబంధించిన సమస్యలు, వయోభారానికి సంబంధించిన సమస్యలు తలెత్తినట్టుగా సమాచారం. దీనిపై రజినీకాంత్ భార్య లత మీడియాతో మాట్లాడారు. ఆయన బాగానే ఉన్నారు.. ఆల్ ఈజ్ వెల్ అని అన్నారు. మరోవైపు ప్రస్తుతం రజినీకాంత్ నటించిన వెట్టైయాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొస్తోంది.

Advertisement

Next Story

Most Viewed