రతికా రోజ్‌తో స్టార్ సీరియల్ యాక్టర్ చాటింగ్.. క్లారిటీ!

by Anjali |
రతికా రోజ్‌తో స్టార్ సీరియల్ యాక్టర్ చాటింగ్.. క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ నటుడిగా కొనసాగుతోన్న మానస్ గురించి సుపరిచితమే. బిగ్‌బాస్ హౌస్‌ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. హౌజ్ నుంచి పాజిటివ్ ఇమేజ్‌తో బయటికొచ్చాడు. కాగా ఈ నటుడి ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ ప్రస్తుతం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదిస్తున్నాయి. ఇప్పుడు మానస్ స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్‌లో హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్‌గా శ్రీజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇకపోతే మానస్ బిగ్‌బాస్ సీజన్ -7 లో పాటిస్పెట్ చేసిన రతిక గురించి ఎవరితోనో వాట్సాప్‌లో చాట్ చేశాడని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ నటుడు స్పందించి.. ‘‘అది మానస్ వాట్సాప్ నెంబరు కాదని’’ క్లారిటీ ఇచ్చారు. స్క్రీన్ షార్ట్ కూడా చూపించాడు. ప్రస్తుతం మాసస్ సోషల్ మీడియాలో పెట్టి జనాలకు స్పష్టత ఇచ్చిన స్క్కీన్ షార్ట్స్ వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed