- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
14 ఏళ్ల నుంచి ప్రేమ.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స్టార్ హీరో కూతురు.. ఈ ఏడాదిలోనే పెళ్లి.. (ఫొటోస్)

దిశ, సినిమా: స్టార్ హీరో శరతకుమార్ కూతిరుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. ‘తెనాలి రామకష్ణ బిఏ.బిఎల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. తన నటనతో ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అంతే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. ఎటువంటి అనౌన్స్‌మెంట్ లేకుండా తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది వరలక్ష్మీ.
నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ నిన్న అట్టహాసంగా జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుకలు జరిగినట్లు సమాచారం. అయితే.. వరలక్ష్మీ, నికోలాయ్ గత 14 ఏళ్లు నుంచి ఒకరికి ఒకరు తెలుసంటూ కుటుంబసభ్యులు చెప్తుండగా.. వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అయుంటుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కాగా.. ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ప్రస్తుతం ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. శుభకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.