తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

by Hamsa |
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ సంపాదించుకుంది. అంతేకాకుండా బాలీవుడ్‌, టాలీవుడ్‌లో వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే దీపికా పదుకొణె 2018లో నటుడు రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చి పాన్ ఇండియన్ మూవీస్ చేస్తుంది. స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్‌ను సొంతం చేసుకుని తన నటనతో అందరినీ మెప్పిస్తుంది.

ఇటీవల ఈ అమ్మడు ఫైటర్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే దీపికా తల్లి కాబోతుందంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వాటిపై రణ్‌వీర్, దీపికా స్పందించలేదు. తాజాగా, దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తాను రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులం కాబోతున్నట్లు సెప్టెంబర్‌‌ 2024లో డెలివరీ కానున్నట్లు హింట్ ఇచ్చింది. ప్రస్తుతం దీపికా పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed