స్టార్ హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. పెళ్లి లో అది వద్దంటున్న హీరోయిన్?

by Jakkula Mamatha |
స్టార్ హీరోయిన్ పెళ్లి డేట్ ఫిక్స్.. పెళ్లి లో అది వద్దంటున్న హీరోయిన్?
X

దిశ, వెబ్ డెస్క్:టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్ , బాలీవుడ్ లో అమ్మడుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న అమ్మడు స్టార్టింగ్ లో వరుస సినిమాలతో బిజీ గా ఉంది. అమ్మడు నటించిన సినిమాలు హిట్ అందుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో తనదైన శైలిలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ సినిమాలతో బిజీగా ఉంటునే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఈ మధ్య రకుల్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు అతనితో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయాన్ని ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడో అనౌన్స్ చేసింది. రీసెంట్ గా రకుల్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నాని తో ఫిబ్రవరి 21న గ్రాండ్ గా గోవాలో వీళ్ళ పెళ్లి జరగబోతుందనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు వీరిద్దరు దగ్గరుండి చూసుకుంటున్నారని ఆమే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే.. బ్యూటీ తన మ్యారేజ్ ను వెస్టర్న్ ట్రెడిషన్ లో చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. తన పెళ్లి లో కాలుష్య రహితంగా ఉండాలని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. టపాసులు కాల్చి పెళ్లి మండపంలో పోల్యుషన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు అని రకుల్ చెప్పిన మాటలకు ఫ్యాన్స్ ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు. సినీ రంగంలో ఇంత వరకు ఏ హీరోయిన్ ఇలా చేయలేదు. టపాసులు వద్దంటున్న ఫస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజెంట్ రకుల్ వెడ్డింగ్ పనుల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed