బాయ్‌ఫ్రెండ్ శాంతనుతో బ్రేకప్ కన్ఫర్మ్.. సడెన్‌గా అలాంటి పోస్ట్‌తో షాకిచ్చిన శృతి హాసన్

by Hamsa |
బాయ్‌ఫ్రెండ్ శాంతనుతో బ్రేకప్ కన్ఫర్మ్.. సడెన్‌గా అలాంటి పోస్ట్‌తో షాకిచ్చిన శృతి హాసన్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గత కొద్ది కాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికాతో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. నిత్యం వీరిద్దరు పలు రొమాంటిక్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంటారు. అలాగే వీరు తొందరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో.. శృతి హాసన్, శాంతన్‌ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడంతో బంధానికి గుడ్ బై చెప్పి బ్రేకప్ చెప్పుకున్నట్లు ఇటీవల వార్తలు జోరందుకున్నాయి.

కానీ దీనిపై వారు అధికారికంగా ప్రకటించకపోవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. తాజాగా, శృతి హాసన్ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా మొదటి సారి బ్రేకప్ గురించి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ బ్యూటీ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ పెట్టింది. ఇందులో ఓ నెటిజన్ల ప్రస్తుతం మీరు సింగిలా? లేదా కమిట్ అయ్యారా? అని అడిగాడు.

దానికి శృతి స్పందిస్తూ.. ‘‘ ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పడం నాకు సంతోషంగా అనిపించదు. కానీ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ప్రస్తుంతం సింగిల్‌గానే ఉన్నా. మింగిల్ అయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. నా పనిని ఆస్వాదిస్తున్నా అందులోనే నేను ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతానికి నాకు ఇది చాలు’’ అని చెప్పుకొచ్చిన వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెళ్లి చేసుకుంటారనుకుంటే చివరికి ఇంత పెద్ద షాకిచ్చావేంటి? అని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed