ఇమేజ్, అందం గురించి పట్టించుకోను.. నగ్నంగా నటించడానికైనా రెడీగా ఉన్నానంటూ స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

by Hamsa |
ఇమేజ్, అందం గురించి పట్టించుకోను.. నగ్నంగా నటించడానికైనా రెడీగా ఉన్నానంటూ స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల అందరికీ సుపరిచితమే. అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇట్లు ‘మారేడిమిల్లి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విరూపాక్ష, ప్రియురాలు, మా ఊరు పొలిమేర, పొలిమేర-2 వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ అందుకోవడంతో ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారిపోయింది.

అలాగే కామాక్షి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. ఇటీవల ఈ అమ్మడు సైతాన్ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి షాకింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ రోల్ పండించడం నటిగా నా కర్తవ్యం. సన్నివేశం డిమాండ్ చేస్తే బట్టలు లేకుండా నగ్నంగా నటించడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను.

పాట నచ్చితే మంచి యాక్టర్ పక్కన ఆడిపాడి మెప్పిస్తాను. ఈ రోజు ఉండి రేపు ఊడిపోయే ఇమేజ్, అందం గురించి నేను పెద్దగా పట్టించుకోరు. కాబట్టి దర్శకులు గుర్తుంచుకుని నాకు సినిమాల్లో క్యారెక్టర్స్ ఇవ్వండి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కామాక్షి కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఫేమ్ తెచ్చుకునేందుకు ఏదైనా చేస్తారు అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed