రాజమౌళి సినిమా నుంచి కీలక అప్ డేట్ లీక్.. డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్న మహేష్ బాబు..

by Sujitha Rachapalli |
రాజమౌళి సినిమా నుంచి కీలక అప్ డేట్ లీక్.. డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్న మహేష్ బాబు..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న #SSMB29 ప్రాజెక్ట్ గురించి లుక్ పూర్తిగా మార్చేశాడు ప్రిన్స్. 20 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ హాలీవుడ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. పాన్ వరల్డ్ సినిమాకు పర్ఫెక్ట్ స్టార్ ఆనిపించుకుంటున్నాడు. జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూరుస్తుండగా... అమెజాన్ అడవుల్లో షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి కాగా రెగ్యులర్ షూటింగ్ డేట్స్ అనౌన్స్ చేయనున్నారు.

ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కీలక అప్ డేట్ లీక్ అయింది. హీరో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అన్నాదమ్ములుగా కనిపించబోతున్నాడని.. ఒకరు అమెజాన్ అడవులకు వెళ్లి అడ్రస్ లేకుండా పోయిన తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన బ్రదర్ ప్రపంచానికి తెలియని ఓ కొత్త విషయాన్ని కనుక్కుంటాడని సమాచారం. మొత్తానికి ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. మహేష్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. జక్కన్న అంటే ఆ మాత్రం ఉంటుందని.. ఈ సినిమా హాలీవుడ్ రికార్డ్స్ ను కూడా కొల్లగొట్టాలని కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed