లావణ్య,సమంత బాటలోనే శ్రీలీల.. ఆ బడా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లబోతుందా?

by Disha Web Desk 8 |
లావణ్య,సమంత బాటలోనే శ్రీలీల.. ఆ బడా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లబోతుందా?
X

దిశ, ఫీచర్స్ : చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లీలు అనేవి చాలా కామన్. హీరో, హీరోయిన్స్, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది ప్రేమలో పడుతారు. ఇక కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్లితే, మరి కొన్ని ప్రేమలు మధ్యలోనే ఆగిపోతాయి. అలాగే కొంత మంది నటీనటులు ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకొని, చిన్న చిన్న మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా జంటలు ఇలా పెళ్లి చేసుకొని విడిపోయిన సంఘటనలు మనం చూశాం. అయితే ఇటీవల అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ నటి వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొని, మెగా ఇంటికి కోడలిగా వెళ్లిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇలా సమంత, కూడా అక్కినేని వారసుడు నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడిపోయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరోయిన్, త్వరలో బడా ఇంటికి కోడలిగా వెళ్లబోతోంది అంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల. అయితే ప్రస్తుతం శ్రీ లీల పరిస్థితి కాస్త ఇబ్బందుల్లో పడింది. ఆమె తీసిని ఏ సినిమా అయినా సరే ఫ్లాప్ అవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల వాళ్ల అమ్మగారు , ఈ ముద్దుగుమ్మ జాతకం చూపెట్టారంట. వారు నటి జాతకం చూసి, ఆమె త్వరలో ఓ బడా హీరోను పెళ్లి చేసుకోబోతుంది. త్వరలోనే ఈ అమ్మాయి ఓ బడా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లబోతోంది అంటూ చెప్పినట్లు ఓ వార్త కన్నడ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రస్తుం ఈ న్యూస్ టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

తడి తడి అందాలతో కవ్విస్తున్న అనుపమ.. ఆ హోయలు చూడతరమా..

Next Story

Most Viewed