హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు దక్కించుకుంటోన్న ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా?

by Anjali |   ( Updated:2024-09-15 14:46:21.0  )
హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు దక్కించుకుంటోన్న ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది చిన్నారులు అగ్ర హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. నేడు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజా సజ్జా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి సినిమా(ఇంద్ర)లో బాలనటుడిగా అద్భుతంగా నటించి అప్పుడే ప్రేక్షకుల మెప్పు పొందాడు. ‘ఈ కుర్చీలో కూర్చునే మగాడు లేడా?’ అని తెలంగాణ శకుంతల గంభీరంగా అడగ్గా.. అక్కడున్న కొమ్ములు తిరిగిన మగాళ్లందరూ తలలు వంచుకుంటారు. కానీ అప్పుడే బడి నుంచి వచ్చిన తేజా నేనున్నాను నాయనమ్మ అంటూ వచ్చి కూర్చీలో ధైర్యంగా కూర్చుంటాడు. ఇలా ఎందరో చైల్డ్ ఆర్టిస్టులు ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.

ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కీరవాణి కుమారులు కూడా మంచి పొజిషన్‌లో ఉన్నారు. శ్రీ సింహ, కాల భైరవ చిన్నప్పుడు ఓ సూపర్ హిట్ సీరియల్‌లో నటించారట. అప్పట్లో చాలా మంది ఫేవరెట్ సీరియల్ అయిన అమృతం సీరియల్‌లో 12 వ ఎపిసోడ్‌లో పలువురు పిల్లలతో ఓ సన్నివేశం ఉంటుంది. అలాగే శ్రీసింహ యమదొంగ మూవీలో బాల నటుడిగా చేశాడు. ప్రస్తుతం కీరవాణి పెద్ద తనయుడు సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు పొందుతున్నాడు. అలాగే చిన్న కుమారుడు హీరోగా జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా తెరకెక్కిన మత్తు వదలరా2 లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ లభిస్తుంది. మరో ట్విస్ట్ ఏంటంటే? ఈ మూవీకి బ్రదర్ కాలభైరవనే సంగీతాన్ని అందించారు. ప్రజెంట్ వీరిద్దరి చిన్నప్పటి క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వగా.. భలే క్యూటుగున్నారంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story