మాస్ మహారాజా 75వ మూవీలో శ్రీలీల ఫిక్స్.. అప్డేట్ విడుదల రిలీజ్ ఎప్పుడంటే?

by Hamsa |
మాస్ మహారాజా 75వ మూవీలో శ్రీలీల ఫిక్స్.. అప్డేట్ విడుదల రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇటీవల ‘RT75’ పేరుతో ఓ మూవీ రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, రవితేజ- శ్రీలీల కలిసి ‘RT 75’ మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లు సమాచారం. షూటింగ్ కూడా తొందరలో స్టార్ట్ అవబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రవితేజ-శ్రీ లీల ఇప్పటికే నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ. 100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్‌కు సంపాదించుకుంది.

Next Story

Most Viewed