గుర్తు పట్టని విధంగా శ్రీలీల..క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిందిగా..

by Disha Web Desk 8 |
గుర్తు పట్టని విధంగా శ్రీలీల..క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిందిగా..
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన డ్యాన్స్, నటనతో ఎంతో మందని ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్‌లో ఈ అమ్మడు వరస ఆఫర్లతో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ ఏంటో ఈ అమ్మడుకు వరుసగా ఆఫర్లు వచ్చినా అన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ కావడం కాస్త ఇబ్బందులకు గురి చేసే విషయంగా చెప్పవచ్చు.

అయితే తాజాగా శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్‌లో అదరగొట్టింది. అమెరికాలో పుట్టిన శ్రీలీల చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఇటీవల జరిగిన సమత కుంభ్‌-2024 లో ఆమె తన ప్రదర్శనతో అందరినీ అలరించింది.గోదాదేవిగా ఆమె అభినయానికి వీక్షకులు ఫిదా అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఫెర్ఫార్మ్ చేసి వావ్ అనిపించింది. ఇక ఈవీడియోను ముద్దుగుమ్మ శ్రీలీల ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ఇలా క్యాప్షన్ ఇచ్చింది.

మీకు తెలుసో లేదో నా చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్‌తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను నా చిన్నతనం నుంచే మా టీమ్‌తో కలిసి ఆలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లేదాన్ని, అప్పటి నుంచే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ రోజుల్లో నుంచే డ్యాన్స్ అనేది నా జీవితంలో ఒక హాబీగా మారిపోయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ప్రదర్శన చేయడం కొత్తగా అనిపించింది. దాదాపు 10-15ఏళ్ల తర్వాత స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. గోదాదేవి అంటే మహిళల్లో రత్నం లాంటిదని అర్థం. ఆమె గాథ ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం శ్రీలీలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


Next Story