వాడు నా పక్కన లేక రోజు నిద్ర పట్టడం లేదు.. వస్తే ఆ పని చేస్తానంటూ బిగ్‌బాస్ అశ్విని బోల్డ్ కామెంట్స్!

by Disha Web Desk 6 |
వాడు నా పక్కన లేక రోజు నిద్ర పట్టడం లేదు.. వస్తే ఆ పని చేస్తానంటూ బిగ్‌బాస్ అశ్విని బోల్డ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: నటి అశ్విని పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియా తన హాట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట రచ్చ చేసింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజన్ 7 షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని హౌస్‌లో బోల్డ్‌గా కనిపించింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, శుభశ్రీ తో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని బోల్డ్ కామెంట్స్ చేసి షాకిచ్చింది. ‘‘ నేను పెళ్లి చేసుకోబోయే వాడు ఇండస్ట్రీకి చెందిన వారు కాకున్నా పర్వాలేదు. మంచి వాడైతే చాలు. అతను నాకు నచ్చిన వెంటనే పెళ్లి చేసుకుని వెళ్లిపోతా.

అయితే ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మంది వాడుకుని వదిలేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే నేను వారికి చాన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు. నా లైఫ్‌లోకి కరెక్ట్ పర్సన్ ఇంకా రాలేదు. నా డ్రీమ్ బాయ్ కోసమే నేను ఎదురుచూస్తున్నాను. వాడు లేకపోవడం వల్ల రోజు రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. బెడ్‌పై పడుకున్నప్పుడు ఎవడైనా పక్కన పడుకుంటే కానీ నిద్ర రావడం లేదు.

వాడు వచ్చాక గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటే నిద్ర పడుతుందేమో. రోజూ రాత్రి 4 అవుతుంది. తొందరగా ఎక్కడున్నాడో వెతుక్కోవాలి. నేను నిజంగానే చెప్తున్నా. వాడు లేకపోవడం వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. కాబట్టి తొందరగా నా డ్రీమ్ బాయ్ ఎక్కడున్నాడో తొందరగా రావాలని రోజూ ఆ దేవుడిని వేడుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అశ్విని కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన కుర్రాళ్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed