- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దక్షిణాదిలో నిజంగా గొప్ప నటులు ఉన్నారు : అనిల్ కపూర్

దిశ, సినిమా: గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన మూవీ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఈ మూవీలో రణబీర్ నటన ఒకెత్తయితే మిగతా అన్ని పాత్రలకు కూడా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా హీరోకి.. తండ్రి అనిల్ కపూర్ మధ్య ఉండే బంధం ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా చూపించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిల్ కపూర్ సౌత్ ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..‘దర్శక నిర్మాతలు మంచి పాత్రలకు నన్ను ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని. నాకు సమయం దొరికినప్పుడల్లా యూత్‌తో ఎక్కువగా మింగిల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే వారి కొత్త ఆలోచనలు ఆసక్తిగా ఉంటాయి. నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దక్షిణాది చిత్రాలే.
ఎందుకంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు సౌత్ రీమేక్‌లే. దేశంలో ఉన్న గొప్ప నటుల్లో ఎక్కువమంది సౌత్ సినిమాలను రీమేక్ చేసినవారే. కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్‌ఆర్’, ‘పుష్ప’ వంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. దక్షిణాదిలో నిజంగా గొప్ప నటులు ఉన్నారు. అలాగే, మంచి కథలు ఉన్నాయని నేను నమ్ముతున్నా. సినిమాలను టాలీవుడ్, బాలీవుడ్ అంటూ భాష పరంగా విడదీయకూడదు. అన్నిటినీ భారతీయ చిత్రాలుగానే చూడాలి’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.