తను నా హార్ట్‌ను టచ్ చేసిందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సోనూసూద్.. అసలు ఏం జరిగిందంటే!

by Hamsa |
తను నా హార్ట్‌ను టచ్ చేసిందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సోనూసూద్..  అసలు ఏం జరిగిందంటే!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో సోనూసూద్ హిందీ, తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే కరోనా సమయంలో ఎంతో మంది కూలీలు ఇళ్లకు చేరుకోవడానికి ఆయన చేసిన సాయం మరువలేనిది. ఆ తర్వాత కూడా సోనూసూద్ అనారోగ్యంతో ఉన్న వారికి డబ్బు సాయంతో పాటుగా.. ట్రీట్మెంట్ కూడా చేయించాడు. ఇప్పటికీ పలువురు సోషల్ మీడియా ద్వారా సహాయం కోరితే వెంటనే ఆయన స్పందించి వారికి సాయం చేస్తున్నారు.

పూర్తిగా సినిమాలకు దూరమై సహాయం చేసేందుకు మక్కువ చూపిస్తున్నాడు. తాజాగా, ఓ అభిమాని సోనూసూద్‌కి షాకిచ్చాడు. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుని హీరో ఎమోషనల్ అయ్యాడు. సోనూసూద్ కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశాక ఓ ఫ్యాన్ హీరో బిల్లు మొత్తం కట్టేశాడు. అంతేకాకుండా ఓ లెటర్‌ను ఆయన టెబుల్ వద్దకు కూడా పంపి ఆయనను షాక్‌కి గురి చేశాడట. ఆ నోట్ షేర్ చేస్తూ.. ‘‘ ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ ఎవరో ఒక రెస్టారెంట్‌లో మా డిన్నర్‌కి అయిన మొత్తం బిల్లును చెల్లించి ఈ స్వీట్ నోట్‌ను పంపించాడు. ఇది నా హర్ట్‌ను టచ్ చేసింది. థాంక్యూ బడ్డీ’’ అంటూ సోనూపూద్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

Next Story

Most Viewed