సోనాలీ ఫోగట్ డెత్ కేసు.. విచారణలో షాకింగ్ విషయాలు

by Dishanational4 |
సోనాలీ ఫోగట్ డెత్ కేసు.. విచారణలో షాకింగ్ విషయాలు
X

దిశ, సినిమా: బీజేపీ నాయకురాలు, నటి సోనాలీ ఫోగట్ డెత్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది సీబీఐ. అయితే అంతకు ముందు గోవా పోలీసు ఈ కేసులో ఫోగట్ మేనేజర్ సుధీర్ సంఘ్వాన్, అసోసియేట్ సుఖ్విందర్, ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్ట్ చేశారు. కాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సోనాలి మరణించిన రోజు గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు సుధీర్. ఎండీఎంఏ డ్రగ్స్ ఆర్డర్ చేసిన నటి.. అధిక మోతాదులో తీసుకోవడంతో కర్లీస్ క్లబ్‌లో నడవలేకపోయిందని, దుస్తుల్లోనే యూరిన్ చేసుకుందని తెలిపినట్లు సమాచారం.

ఆగస్టు 22న సుధీర్, సోనాలి, సుఖ్విందర్ గోవాకు వెళ్లి ఉత్తర గోవాలోని అంజునాలోని గ్రాండ్ లియోని రిసార్ట్‌లో బస చేశారు. సాయంత్రం 4:30 గంటలకు, సోనాలి సుఖ్విందర్‌ని MDMA డ్రగ్స్ తీసుకోమని కోరింది. ముగ్గురికి కూడా డ్రగ్స్ తీసుకోవాలనే కోరిక అధికంగా ఉండటంతో.. 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌కు రూ.12 వేలు అవుతుందని సుఖ్విందర్ చెప్పినట్లు తెలిపాడు సుధీర్. దీంతో రూ. 5 వేలు నగదు ఇచ్చి తన తరపున రూ.7 వేలు ఇవ్వాలని కోరాడు.

తొమ్మిది గంటల సమయంలో సుఖ్విందర్ తీసుకొచ్చిన డ్రగ్స్‌ను ముగ్గురూ ముక్కు ద్వారా తీసుకుని.. ఆ తర్వాత కర్లీస్ క్లబ్‌కు వెళ్లినట్లు తెలిపాడు మేనేజర్. అయితే సోనాలీ ఓవర్ డోస్ తీసుకోవడంతో వాంతులు అయ్యాయని.. తననే టాయిలెట్ తీసుకెళ్లమని కోరినట్లు చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్ చేరుకున్న ఆమె.. వాటర్ తాగుతూనే ఉందని, మళ్లీ టాయిలెట్ తీసుకెళ్లే క్రమంలో సరిగ్గా నడవలేకపోయిందని చెప్పాడు. అందుకే అక్కడే టాయిలెట్ సీట్‌పైనే కూర్చుందని, వేసుకున్న డ్రెస్‌లోనే యూరిన్ చేసుకుందన్న సుధీర్.. తనే స్వయంగా క్లీన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Also Read : చిత్ర పరిశ్రమలో విషాదం.. రష్మీ ఇకలేదు అని బాధపడుతున్న ఫ్యాన్స్

Next Story