ఆ హీరోతో ఘనంగా హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి

by Sujitha Rachapalli |
ఆ హీరోతో ఘనంగా హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి
X

దిశ, సినిమా : హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి న్యూస్ కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతుంది. రెండు కుటుంబాలు వేరు వేరు మతాలకు చెందడం , సోనాక్షి తండ్రి ఆమె వివాహం చేసుకోవడం ఇష్టం లేనట్టు మాట్లాడటంతో ఇంతకీ ఈ తంతు జరుగుతుందా ఆగిపోతుందా అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా హీరో జహీర్ ఇక్బాల్ ను మ్యారేజ్ చేసుకుంది ఈ బ్యూటీ. ఏ మత సంప్రదాయంతో సంబంధం లేకుండా సింపుల్ గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుని అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇద్దరు వైట్ కలర్ వెడ్డింగ్ డ్రెస్సుల్లో మెరిసిపోగా.. పెళ్లి తర్వాత స్పెషల్ నోట్ షేర్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు తమ మనసులో ఉన్న ప్యూర్ లవ్.. తమను ఇక్కడి వరకు నడిపించిందని, ఒక్కటి చేసిందని రాసుకొచ్చారు. తమ ప్రేమను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనా భరించామని... ఫైనల్ గా భార్యాభర్తలుగా మారామని తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

కాగా శత్రుఘ్న సిన్హా కూతురైన సోనాక్షి పెళ్లి తర్వాత మతం మారుతుందా? ముస్లింగా కన్వర్ట్ అవుతుందా? అనే సందేహాలు తలెత్తగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. తమకు నచ్చినట్లుగా ఉంటామని వధూవరులు తేల్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమకు ప్రైవసీ కావాలని కోరారు. కాగా చాలా కొద్ది మంది అతిథుల మధ్య వివాహం జరగ్గా త్వరలో ఇండస్ట్రీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

Next Story

Most Viewed