'బ్రా సైజ్ భారీగా.. నడుము మాత్రం చిన్నగా కావాలా?'.. హీరోయిన్ల డిస్కషన్ వైరల్

by Disha Web Desk 6 |
బ్రా సైజ్ భారీగా.. నడుము మాత్రం చిన్నగా కావాలా?.. హీరోయిన్ల డిస్కషన్ వైరల్
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీస్ హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా కలయికలో వస్తున్న చిత్రం 'డబుల్ XL'. స్ర్తీ, పురుషుల బాడీ షేమింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా సత్రమ్ రమణి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హ్యూమా అండ్ సోనాక్షి ఓ బెంచ్‌పై కూర్చొని అబ్బాయిలు ఎలాంటి బాడీ ఉన్న అమ్మాయిలను ఇష్టపడుతారో చర్చించుకుంటూ నవ్వుకుంటున్నారు. 'స్త్రీ పెద్ద వదులైన ఉన్న కుర్తా ధరించినప్పుడు కూడా శరీరంలో ఎంత కొవ్వు ఉందో కనిపెట్టేయవచ్చు. మీరు మీ పొట్టను ఎంత లోపలికి లాక్కున్నా.. మీ తొడలు ఎల్లప్పుడూ జీన్స్ ప్యాంట్‌కు అతుక్కుపోతాయి' అని హ్యూమా జోక్ వేయగా.. 'బ్రా సైజ్ పెద్దగా ఉండాలి కానీ నడుము మాత్రం చిన్నగా ఉండాలని కోరుకునే అబ్బాయిలు ఎక్కడికి పోతారు' అంటూ సోనాక్షి వంత పాడుతుంది. ఇక 30 సెకన్ల చిన్న టీజర్‌ను T-సిరీస్ నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకోగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రెకెత్తిస్తోంది. భూషణ్ కుమార్, క్రిష్ణన్ కుమార్, విపుల్ డి షా, రాజేష్ బహ్‌లా, అశ్విన్ వార్దే, సాకిబ్ సలీమ్, హ్యూమా ఖురేషి, ముదస్సర్ అజీజ్ కలిసి నిర్మించిన చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.



Next Story

Most Viewed