ఆరుగురితో అక్రమ సంబంధం.. గర్ల్ ఫ్రెండ్‌ను సిగరెట్స్‌తో కాల్చి వేధించిన హీరో..

by Disha Web Desk |
ఆరుగురితో అక్రమ సంబంధం.. గర్ల్ ఫ్రెండ్‌ను సిగరెట్స్‌తో కాల్చి వేధించిన హీరో..
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై తన మాజీ ప్రియురాలు, పాకిస్థాన్ నటి సోమీ అలీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ లైంగిక వేధించే వ్యక్తిగా పేర్కొంటూ.. 'బాలీవుడ్ హార్వే వైన్‌స్టీన్'గా అభివర్ణించింది. అంతేకాదు తనతోపాటు సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లతో సంబంధాలు పెట్టుకున్న సల్మాన్.. ప్రస్తుతం ఇలియా వంతూర్‌తో తిరుగుతున్నాడని తెలిపింది. అలాగే భారతదేశంలో తన ప్రదర్శనను నిషేధించేందుకు తప్పుడు కేసు పెడతానని బెదిరించాడన్న సోమీ.. 'సల్మాన్ ఉమెన్ బీటర్. పిరికిపంద. సిగరెట్‌తో కాల్చడం, శారీరక వేధింపులకు గురిచేయడం అతడి నైజం. నన్ను చాలా కష్టపెట్టాడు. అతడి నుంచి నన్ను రక్షించడానికి 50 మంది న్యాయవాదులున్నారు. అతడొక మగ దురహంకార పంది. అనేక మంది స్త్రీలను కొట్టిన ఈ వ్యక్తికి మద్దతిస్తే మహిళలకు అవమానం' అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. కానీ కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీజ్ చేయడం విశేషం.


Next Story

Most Viewed