- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి కాకుండానే తల్లి కావాలనుకుంటున్న శోభితా ధూళిపాళ.. అదే అసలైన అర్థం అంటూ షాకింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగు అడవి శేష్ గూఢచారి సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మేజర్ మూవీతో విజయం అందుకుని ఒక్కసారిగా తన పాపులారిటీ పెంచుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు, హీందీలో పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ ఓటీటీని షేక్ చేస్తుంది. అయితే ఇటీవల శోభిత దూళిపాళ, నాగచైతన్య ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే చై, శోభిత ఓ హోటల్‌లో కలిసి సన్నిహితంగా కనిపించడంతో అంతా నిజమేనని నమ్మేశారు. కానీ అలాంటి వార్తలపై వీరిద్దరు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.
ఇవన్నీ పట్టించుకోకుండా శోభిత వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది. తొందరలో మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన జీవితానికి అసలైన అర్ధం తల్లి అవడమే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ జీవితంలో ఓ లక్ష్యం ఉంటుందని నేను అనుకోను. కానీ మనం ఏం చేసినా ఆనందంగా చేయాలి. నాకంటూ పెద్దపెద్ద లక్ష్మాలు ఏమీ లేవు.
కానీ కొన్నిసార్లు నాకు తెలియకుండానే జీవితంలో నేను మాతృత్వం కోరుకుంటున్నాను. అదే నా జీవితానికి అసలైన అర్థం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దాన్ని ఎప్పుడు అనుభవిస్తానో కానీ అదొక అద్భుతమైన ఫీలింగ్. అమ్మనవ్వడం, అమ్మ అని పిలిపించుకోవడం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. అందుకోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ అమ్మడుకి పెళ్లి కాకపోవడంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.