సంప్రదాయ దుస్తుల్లో సితార క్యూట్ లుక్స్.. సోషల్ మీడియా షేక్

by Hamsa |
సంప్రదాయ దుస్తుల్లో సితార క్యూట్ లుక్స్.. సోషల్ మీడియా షేక్
X

దిశ, వెబ్‌డెస్క్: మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేనికి గురించి పరిచయం అక్కర్లేదు. 12 ఏళ్లు కూడా దాటకుండానే సితార ఇటీవల ఓ యాడ్‌తో రికార్డ్ సృష్టిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఫుల్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. నేడు వినాయక చవితి కావడంతో సితార అదిరిపోయే పిక్స్ షేర్ చేసింది. గ్రీన్ కలర్ ఆఫ్ సారీ ధరించి తన క్యూట్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఆ ఫొటోలకు ‘‘గణేశ చతుర్థి శుభాకాంక్షలు! గణేశుడు మీ జీవితం నుండి అన్ని అడ్డంకులను తొలగించి, సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని తన ఆశీర్వాదాలతో మీకు ప్రసాదిస్తాడు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు దిల్ సింబల్స్‌ను షేర్ చేస్తున్నారు.

Next Story