షణ్ముఖ్ అరెస్ట్‌పై స్పందించిన సిరి హనుమంత్.. ఏమన్నారంటే..?

by sudharani |
షణ్ముఖ్ అరెస్ట్‌పై స్పందించిన సిరి హనుమంత్.. ఏమన్నారంటే..?
X

దిశ, సినిమా: బిగ్ బాప్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన అన్న సంతప్ (31) వేరే యువతిని ప్రేమించి పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసిన కేసులో.. సంతప్ కోసం ఇంటికి వచ్చిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. 18 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా షణ్ముఖ్ జస్వంత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అతడు గంజాయి సేవించాడని నిర్ధారణ కావడంతో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక షన్నును అరెస్ట్ చేసిన వీడియోలో తాను డిప్రెషన్‌లో ఉండే డ్రగ్స్ తీసుకున్నానని, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నానని ఏడ్చుకుంటూ చెప్పాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అసలు షన్ను ఎందుకు అంత డిప్రెషన్‌కు లోనయ్యాడు అనేది అంతుపట్టని ప్రశ్నగా మారిపోయింది. అయితే.. దీనిపై సిరి హనుమంత్ స్పందించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిరి మాట్లాడుతూ.. ‘హౌస్ నుంచి వచ్చాక మాపై ట్రోలింగ్స్ వచ్చాయి. ఆ రూమర్స్ నన్ను ఎంతగానో బాధపెట్టాయి. అయితే ఆ డిప్రెషన్ నుంచి నేను త్వరగానే బయటపడ్డాను. షన్ను పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత మేము మాట్లాడుకోవడం మానేశాము. అతని బ్రేకప్ అయ్యాకా కలవడం పద్దతి కాదని కలవలేదు. ఇక ఇప్పుడప్పుడే షన్నుని కలవడం కుదరదు. మేము కలిసినా, కలవకపోయిన అతుడు బావుండాలనే కోరుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది.

కాగా.. షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ బిగ్ బాస్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అక్కడ వీళ్ల రొమాన్స్‌కు తిట్టుకోని వాళ్లు అంటూ లేరు. ఈ కారణంగా షణ్ముఖ్‌కు దీప్తి సూనైనాతో బ్రేకప్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా వీళ్లు మధ్య ఎఫైర్ నడిచిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్ తట్టుకోలేక ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక సిరి పలు షోలతో బిజీగా గడుపుతుంటే.. షణ్ముక్ మాత్రం గంజాయి కేసులో పట్టుబడ్డాడు.

Next Story