- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీనియర్ నటిపై సింగర్ చిన్మయి ఫైర్.. అదో పెద్ద కర్మంటూ వీడియో

దిశ, సినిమా: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గానంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె.. నెట్టింట కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతుంటోంది. ఎక్కడైనా ఆడవాళ్ల గురించి ఎవరైనా కొంచెం తేడాగా మాట్లాడారు అనుకుంటే వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంటోంది. ఈ క్రమంలోనే.. తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మపై కూడా ఫైర్ అయింది చిన్మయి. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటి అన్నపూర్ణ మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆమె మాట్లాడుతూ ‘అర్థరాత్రి స్వతంత్య్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని.. ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఈ వీడియో వైరల్ కావడంతో దీనికి చిన్మయి స్పందించింది. ‘మీరు నాకు నచ్చిన యాక్టర్. మీరు ఇలా మాట్లాడటం నాకు హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది. మీరు చెప్పినట్లుగా చెయ్యాలి అంటే.. అర్థరాత్రులు లేడీ డాక్టర్లు, నర్సులు ఎవరూ విధుల్లో ఉండకూడదు. స్త్రీలు కూడా అర్థ రాత్రి ప్రసవించకూడదు. అంతే కాకుండా చాలా ఏరియాల్లో బాత్ రూమ్‌లు లేవు. పల్లెటూరులో చాలా మంది ఇప్పటికి బయటకు పోతుంటారు. అమ్మాయిల వేషధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటి వారు బతుకుతున్న ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ అంటూ’ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.