బిగ్ సర్‌ప్రైజ్ అంటూ సిద్దు జొన్నలగడ్డ పోస్ట్.. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో ఉన్నాడా?

by Disha Web Desk 6 |
బిగ్ సర్‌ప్రైజ్ అంటూ సిద్దు జొన్నలగడ్డ పోస్ట్.. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో ఉన్నాడా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అయితే ఈ మూవీకి సిక్వెల్‌గా ఇటీవల టిల్లు స్క్వేర్ వచ్చింది. ఇందులో సిద్దు, అనుపమ జంటగా నటించారు. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై రూపొందించారు. అయితే టిల్లు స్క్వేర్ మార్చి 29న థియేటర్స్‌లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టి సునామీ సృష్టిస్తోంది. దీంతో మేకర్స్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే టిల్లు హిట్ అందుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్, నాగవంశీ, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ నిన్న రాత్రి పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సిద్దు నెట్టింట పోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేశాడు. ఎన్టీఆర్‌తో దిగిన ఫొటో షేర్ చేస్తూ ‘‘తొందరలో బిగ్‌సర్‌ప్రైజ్ రాబోతుంది’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు కొంపతీసి సిద్దు దేవర సినిమాలో నువ్వు ఉన్నావా ఏంటి? బ్రో అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే కొందరు ఆర్ఆర్ఆర్-2 రాబోతుందేమో అందులో వీరిద్దరు నటిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సిద్దు పోస్ట్ నెట్టింట చర్చానీయాంశంగా మారింది.


Next Story

Most Viewed