'కేజీఎఫ్ 2'పై విమర్శలు చేసిన హీరో సిద్ధార్థ్.. అలా అంటుంటే ఫన్నీగా ఉందంటూ

by Disha Web |
కేజీఎఫ్ 2పై విమర్శలు చేసిన హీరో సిద్ధార్థ్.. అలా అంటుంటే ఫన్నీగా ఉందంటూ
X

దిశ, సినిమా : ఇటీవల రిలీజైన 'కేజీఎఫ్ 2' సినిమా ఇండియాలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా చిత్రంగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై హీరో సిద్ధార్థ్ పలు విమర్శలు చేశారు. తన అప్‌కమింగ్ వెబ్ సిరీస్ ' ఎస్కేప్ లైవ్' ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. 'కేజీఎఫ్ 2'ను పాన్ ఇండియా ఫిల్మ్ అని పిలుస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుందని కామెంట్ చేశారు. 'నేను 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. వాటిని ఇండియన్‌ సినిమాలు అని పిలవడమే నాకు ఇష్టం. పాన్‌ ఇండియా అంటుంటే నాకు అగౌరవంగా అనిపిస్తుంది. దీంతో పాటు పాన్‌ అంటే ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏ సినిమా అయినా భారీ విజయం సాధిస్తే దానిని పాన్ ఇండియా సినిమా అని ఎందుకు పిలవడం.. ఇండియన్ చిత్రం అనొచ్చు కదా' అని చెప్పుకొచ్చాడు.

Next Story