ఆ పండుగ కానుకగా రాబోతున్న శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమా!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-09 05:26:31  IST  )

‘ఈత’ సినిమాను రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 28న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఆ పండుగ కానుకగా రాబోతున్న శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ‘స్త్రీ-2’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఈత’. ఇది ప్రసిద్ధ జానపద కళాకారిణి లావణీ కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. 1940 నుండి 1990 వరకు సాగే ఈ కథలో విఠాబాయి ఎదుగుదల, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, కళాకారిణిగా ఆమె సాధించిన విజయాలను చూపించబోతున్నారు. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో ఎంతో శక్తివంతమైన, భావోద్వేగపూరితమైన పాత్రలో కనిపించనున్నారు. ఆమె కెరీర్‌లోనే ఇది ఒక గుర్తింపు పొందే పాత్ర అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తుండగా..గత ఏడాది ‘ఛావా’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధాతో పాటు రణదీప్ హుడా, మహ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘స్త్రీ 2’ వంటి ఆల్-టైమ్ రికార్డ్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్‌లో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాను రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 28న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Next Story