బాలీవుడ్‌ HERO సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం

by Disha Web Desk 2 |
బాలీవుడ్‌ HERO సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఆదివారం ఉదయం రెండు బైకులపై వచ్చి తుపాకులతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల శబ్ధాలతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడింది ఎవరు అనేది తెలియరాలేదు. వెంటనే స్పందించిన ముంబై పోలీసులు ఎన్‌ఏఐకు సమాచారం ఇచ్చారు. భారీగా పోలీసులు అక్కడకు చేరుకొని భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, గతంలో బిష్ణోయ్ గ్యాంగ్‌నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story