అమెరికాలో కాల్పుల కలకలం.. హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ కాల్చివేత

by Javid Pasha |
అమెరికాలో కాల్పుల కలకలం.. హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ కాల్చివేత
X

దిశ, సినిమా : ఫేమస్ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్(37)ను దుండగలు కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అతను తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నటుడి కారును అడ్డగించిన దుండగులు కారులోని ఉత్ప్రేరక కన్వర్టర్‌ను దొంగిలించడాని ప్రయత్నించారు. వాక్టర్ ఎదురు తిరగడంతో అతనిపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో వాక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు, ఆస్పత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. వాక్టర్ తల్లి కూడా వాక్టర్ మరణాన్ని ధృవీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు. కాగా జానీ వాక్టర్ అనేక సినిమాలు, టీవీ షోలతో అలరించాడు. 2007లో ‘ఆర్మీవైన్స్’ అనే ఫేమస్ టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన వాక్టర్.. జనరల్ హాస్పిటల్ మరో షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. దాదాపు 200 ఎపిసోడ్స్‌లో నటించాడు.

Next Story