బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ సీన్.. ఆ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్!

by Hamsa |
బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ సీన్.. ఆ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్!
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షోకు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, హిందీలో ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో నిర్వాహకులు సీజన్స్‌ను పూర్తి చేస్తూన్నారు. అయితే ఇటీవల బుల్లితెరపై 17 సీజన్స్ కంప్లీట్ కాగా.. ఓటీటీలోనూ బిగ్‌బాస్ షో స్టార్ట్ అయి మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఓటీటీలో సీజన్-3 నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సీరియల్స్ నటీనటులు, యూట్యూబర్స్ పాల్గొన్నారు.

తాజాగా, బిగ్‌బాస్ హౌస్‌లో అనుకోని అతిథిని నెటిజన్లు గుర్తించారు. ఓ కంటెస్టెంట్ లవకేష్ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉండగా.. పాము వెళ్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. అతనికి కొంత దూరం నుంచి నల్లటి పాము వెళ్తున్నప్పటికీ తన పని తాను చేసుకుంటూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట షేర్ చేస్తూ నెటిజన్లు కంటెస్టెంట్లకు భద్రత లేదా నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదా అని అంటున్నారు. దీనిపై ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హౌస్‌లోకి పాము రాలేదని క్లిప్‌ను వచ్చినట్లుగా ఎడిట్ చేశారని తెలిపారు.Next Story

Most Viewed