షూటింగ్ జరుగుతుండగా కనిపించింది.. ఆమె దగ్గరిగా వెళ్లిన ఆ వ్యక్తి ఇప్పుడు..!

by Javid Pasha |
షూటింగ్ జరుగుతుండగా కనిపించింది.. ఆమె దగ్గరిగా వెళ్లిన ఆ వ్యక్తి ఇప్పుడు..!
X

దిశ, సినిమా : అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతం. అందమైన లొకేషన్ కావడంతో సినిమా షూటింగ్ కోసం మూవీ టీమ్ అంతా అక్కడికి వెళ్లింది. సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. ఇది చూడ్డానికి జనాలు కూడా గుంపులు గుంపులుగా తరలి వచ్చారు. ప్రతీ క్షణం ఉత్కంఠ భరితం.. ఆ తర్వాత ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి చూపులు మాత్రం చిత్రీకరణ పరిధిని దాటి చుట్టు పక్కల పరిసరాలను పరిశీలిస్తున్నాయి.

అంతలోనే ఓ మెరుపు మెరిసినట్లు తోచింది. జనం మధ్యలో నుంచి అందమైన రూపమేదో కళ్లముందు కదలాడుతున్నట్లు అనిపించింది. అనుకోకుండానే అతని అడుగులు అటువైపు కదిలాయి. దగ్గరికి వెళ్లాడు.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా.. నీకు నచ్చితేనే.. ఆలోచించి చెప్పు’ అంటూ తన విజిటింగ్ కార్డు తీసి అందించాడు. అలా అందించిన వ్యక్తి మరెవరో కాదు, ప్రస్తుతం మనమంతా స్టార్ డైరెక్టర్, మాస్ డైరెక్టర్ అని పిలుస్తుంటామే.. అతనే.. ది గ్రేట్ పూరి జగన్నాథ్. ఆ కార్డు అందుకున్న అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా? ప్రస్తుతం అతని భార్యగా ఉన్న లావణ్య పూరి. ఒకప్పుడు అలా మొగ్గ తొడిగిన తమ పరిచయం.. ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ గత జ్ఞాపకాలను చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘క్యూట్ లవ్ స్టోరీ.. గ్రేట్ లవ్ స్టోరీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.Next Story

Most Viewed