గుడ్ న్యూస్.. శర్వానంద్-కృతిశెట్టి ‘మనమే’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. (పోస్ట్)

by Hamsa |
గుడ్ న్యూస్.. శర్వానంద్-కృతిశెట్టి ‘మనమే’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ దాదాపు రెండేళ్ల క్రితం ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకుండా సైలెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ‘మనమే’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే ‘మనమే’ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా ఇటీవల విడుదలైన మనమే టీజర్‌లో కృతి, శర్వానంద్ భార్యభర్తలుగా కనిపించడంతో అందరి దృష్టి మనమే సినిమాపై పడింది. వీరిద్దరి కాంబో ఎలా ఉండబోతుందో ఫుల్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా, మనమే మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ.. శర్వానంద్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story