ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్

by Disha Web Desk |
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : షాహిద్ కపూర్ మంచి నటుడు మాత్రమే కాదు సూపర్ డ్యాన్సర్ కూడా. పలు బాలీవుడ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్ మూవ్స్‌తో ఈ విషయాన్ని నిరూపించాడు కూడా. అందుకే తాజగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) అవార్డ్స్ ఫంక్షన్‌లో పర్ఫర్మ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు కూడా. అయితే ఎండింగ్‌లో స్లిప్ అయి కింద పడిపోయాడు. కానీ దీన్ని స్పోర్టివ్‌గా తీసుకున్న హీరో.. వెంటనే లేచి మ్యూజికల్ బీట్స్‌కు తగినట్లుగా స్టెప్స్ కంటిన్యూ చేశాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్, ఆడియన్స్ గట్టిగా అరుస్తూ ఆయనకు చీర్స్ చెప్పారు. దీంతో షాహిద్ వారికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ విష్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘రియల్ హీరో’ అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Next Story