- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కార్తీక దీపం హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. సూర్యపై పోలీసులకు ఫిర్యాదు.. తర్వాత ఏం జరిగిందంటే?
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు ఇటీవల ఎంతో మంది స్టార్ నటీనటులు, హీరోయిన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే అవకాశాల కోసం కమిట్‌మెంట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ కొందరు బయటపడటం లేదు. గత కొద్ది కాలంగా కాస్టింగ్ కౌచ్‌కు గురవుతున్నట్లు కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి అలాంటి వారికి బుద్ది చెప్తున్నారు. తాజాగా, కార్తీక దీపం సీరియల్ నటి ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలు విషయంలోకి వెళితే.. బుల్లితెన నటి అమూల్య గౌడ కార్తీక దీపం సీరియల్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమూల్య గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో నటిస్తోంది. అయితే ఆమెను సూర్య అనే వ్యక్తి సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో అమూల్య ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘ సూర్య అనే వ్యక్తి తనను కాస్టింగ్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. నన్ను ఆడిషన్‌కు పిలిచి వెళ్లి వచ్చాక అసభ్యకరమైన మేసేజ్‌లు పంపుతున్నాడు. లైంగికంగా వేధించడం తో నేను అతడిని నిలదీశాను.
దీంతో అతను నన్ను పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకో పో అని బెదిరించాడు. కాబట్టి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని నేను కోరుతున్నాను. అతనికి బుద్ధి చెప్పి నాకు న్యాయం చేయడం వల్ల మరో మహిళ బలి కాకుండా ఉంటుంది’’ అని ఫిర్యాదులో రాసుకొచ్చింది. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సూర్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అతను పరారీ అయినట్లు తెలుస్తోంది. పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ నెట్టింట ఫైర్ అవుతున్నారు. వాడిని వదిలిపెట్టకండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.