నాగచైతన్య ‘దూత-2’లో టాలీవుడ్ సీనియర్ నటి.. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-09 06:29:50  IST  )

ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘దూత-2’ సిరీస్‌లో ప్రముఖ నటి భూమిక చౌల ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్.

నాగచైతన్య ‘దూత-2’లో టాలీవుడ్ సీనియర్ నటి.. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి!
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. 2023 అక్టోబర్‌లో విడుదలైన ‘దూత’ మొదటి సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రాబోతున్న రెండో సీజన్‌పై డిజిటల్ ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ ‘దూత-2’ పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి నాగచైతన్య తండ్రి, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. ఈ సిరీస్ ద్వారా నాగచైతన్య కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా సరికొత్త అవతారంలోకి మారుతున్నారు. చైతన్య నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ఈ సరికొత్త సీజన్‌కు కూడా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మొదటి సీజన్‌లో నటించిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈ సీజన్‌లోనూ తమ పాత్రలను కొనసాగించనున్నారు. అయితే ఈసారి కథను సరికొత్త నేపథ్యంలో, మరింత మిస్టరీ, సైకలాజికల్ సస్పెన్స్ అంశాలతో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘దూత-2’ సిరీస్‌లో ప్రముఖ నటి భూమిక చౌల ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్. గతంలో 2018లో వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా.. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ‘దూత 2’ కోసం మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఫుల్ స్వింగ్‌లో ‘కింగ్-100’ షూటింగ్..ఆ తేదీకే థియేటర్స్‌లో సందడి చేయబోతోన్న నాగార్జున!

Next Story