రాజమౌళి సినిమాలపై మధుబాల షాకింగ్ కామెంట్స్!

by Anjali |
రాజమౌళి సినిమాలపై మధుబాల షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: సీనియర్ నటి మధుబాల రీసెంట్‌గా ‘శాకుంతలం’ మూవీలో మేనక పాత్ర పోషించింది. అయితే ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన ఆమె.. ‘‘శాకుంతలం’ సినిమా ఫెయిల్ కావడం నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఈ మూవీ కోసం మేకర్స్, ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు.

ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు సినిమాను తేలిగ్గా తీసుకోలేదు. షూటింగ్, డబ్బింగ్ తర్వాత ఏడాదిపాటు గ్రాఫిక్స్ పైనే పనిచేశారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించడానికి చాలా శ్రమించారు. షూటింగ్ సమయంలో మూవీ టీమ్‌పై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ బాగున్నప్పటికీ అంత పెద్ద హిట్ అవుతాయని ఊహించలేదు. కానీ ‘శాకుంతలం’లో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది’ అని తెలిపింది.

Also Read..

పవన్ కల్యాణ్‌‌కు పెద్దగా హిట్లు లేవు, నటన రాదు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

Next Story

Most Viewed