- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
హీరోయిన్‌గా సీనియర్ నటి ఆమని కోడలు.. అందంలో అత్తని మించిపోయిందిగా..

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు VJ సన్నీ.. హీరోగా మూడో సినిమా ‘సౌండ్ పార్టీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ అలరించనుంది. నవంబర్ 24 గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నది చిత్ర బృందం. ఈ క్రమంలోనే హీరోయిన్ హ్రితిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా పలు చిత్రాల్లో నటించాను. సీనియర్ నటి ఆమని నాకు అత్త అవుతుంది. ఆమెతో చిన్నప్పటి నుంచి మంచి బంధం ఉండటంతో సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంది. గతంలో తెలుగులో అల్లంత దూరాన అనే ఓ సినిమా చేశాను. మళ్లీ ఇప్పుడు ‘సౌండ్ పార్టీ’ తో మరోసారి మీ ముందుకు రాబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందంలో అత్తను మించిన కోడలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.