ఆటోలో హంగామా చేసిన సారా.. ఓవర్‌యాక్టింగ్ అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
ఆటోలో హంగామా చేసిన సారా.. ఓవర్‌యాక్టింగ్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తను నటించిన ‘జరా హట్కే జరా బచ్కే’ సినిమాను ప్రమోట్ చేసేందుకు భిన్నమైన ప్రయోగాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ట్రోలింగ్ కూడా ఎదుర్కుంటోంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీ జూన్ 2న విడుదలకానుండగా.. తాజాగా తన ఇంటికి ఆటోలో ప్రయాణించి జనాలను ఆశ్చర్యపరిచింది సారా. అయితే అక్కడున్న జనాలు ఆటోలో ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించగా.. ‘అరే గాడి నహీ ఆయీ’ అని చెబుతూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా ‘ఓవర్‌యాక్టింగ్‌, పబ్లిసిటీ స్టంట్’ అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. ఆమె చాలాసార్లు ఆటోలో ప్రయాణించిందని, ఈ రోజు కారు సమయానికి రాకపోవడంతోనే ఆటో ఎక్కాల్సి వచ్చిందంటూ నటికి మద్ధతుగా నిలుస్తున్నారు.

Read more:

అనసూయకు ఈ మధ్యన బట్టలే బరువైపోతున్నాయంటున్న నెటిజన్లు

Next Story