మొదటి సినిమాకే ఆ హీరోయిన్ కు చుక్కలు చూపించిన నిర్మాతలు .. ఏకంగా ఐదు కోట్లు కట్టాలని కోర్టుకు..

by Sujitha Rachapalli |
మొదటి సినిమాకే ఆ హీరోయిన్ కు చుక్కలు చూపించిన నిర్మాతలు ..  ఏకంగా ఐదు కోట్లు కట్టాలని కోర్టుకు..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ సారా అలీ ఖాన్ ప్రస్తుతం బిజీ అయిపోయింది. రీసెంట్ గా 'యే వతన్ ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. తాజా ఇంటర్వ్యూలో ఫస్ట్ సినిమా ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. నిజానికి తను ' కేదార్ నాథ్ ' సినిమా ముందుగా సైన్ చేశానని.. కానీ అదే సమయంలో ' సింబా' మూవీ కూడా చేయాల్సి వచ్చిందని తెలిపింది. డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో తనపై నిర్మాతలు కేసు వేశారని చెప్పింది. రూ. 5 కోట్లు కట్టాలని డిమాండ్ చేశారని వివరించింది. అయితే ఆ టైంలో తాత చనిపోవడంతో అమ్మ ఢిల్లీలో ఉందని.. తను ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో పడిపోయానని చెప్పింది. తను షూటింగ్ కు వెళ్తానని చెప్పి.. మేనేజ్మెంట్ ను కోర్టుకు పంపించినట్లు తెలిపింది.


తర్వాత ' సింబా ' డైరెక్టర్ రోహిత్.. ' కేదార్ నాథ్ ' నిర్మాతలతో మాట్లాడారని చెప్పింది. వాటికి కావాల్సిన డేట్స్ ఇచ్చారని.. దీంతో గొడవ సద్దుమణిగిందని తెలిపింది. మొత్తానికి ఫస్ట్ సినిమాకే ఇలాంటి అనుభవం కావడంతో తర్వాత డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది ముద్దుగుమ్మ. కాగా సారా అలీ ఖాన్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.Next Story

Most Viewed