‘యానిమల్’లో త్రిప్తి దిమ్రీ పాత్ర ముందుగా ఈ యంగ్ బ్యూటీకే దక్కింది.. కానీ..

by Disha Web Desk 6 |
‘యానిమల్’లో త్రిప్తి దిమ్రీ పాత్ర ముందుగా ఈ యంగ్ బ్యూటీకే దక్కింది.. కానీ..
X

దిశ, సినిమా : ‘యానిమల్’ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. వాయిలెన్స్, బోల్డ్ కంటెంట్ కారణంగా కొందరు ఈ మూవీని విమర్శిస్తే.. మరికొందరు మాత్రం పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా రణ్‌బీర్, రష్మిక, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ యాక్టింగ్‌కు స్పెషల్ అప్లాజ్ దక్కింది. అయితే వీరిందరిలోనూ షార్ట్ అండ్ స్వీట్ క్యారెక్టర్‌లో త్రిప్తి ప్రేక్షకులపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది.

కాగా తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ పాత్ర కోసం ముందుగా సారా అలీ ఖాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తుంది. కానీ ఆ క్యారెక్టర్‌లోని బోల్డ్‌ సన్నివేశాలు, నెగెటివిటీ ముఖ్యంగా తన షూ నాకాలని రణ్‌బీర్ ఆర్డర్ వేసే సీన్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఇమేజ్‌ దెబ్బతింటుందనే భయంతో సారా నో చెప్పినట్లు సమాచారం. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. అదే క్యారెక్టర్‌కు యూత్ కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమా విడుదలకు ముందు త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్ 66వేల మంది ఉంటే ప్రస్తుతం 2.5M పెరిగి పోయారు.Next Story