'శ్రీదేవి శోభన్‌బాబు' నా మ‌న‌సుకి ద‌గ్గరైన సినిమా: సుస్మిత కొణిదెల‌

by Disha Web Desk 17 |
శ్రీదేవి శోభన్‌బాబు నా మ‌న‌సుకి ద‌గ్గరైన సినిమా: సుస్మిత కొణిదెల‌
X

దిశ, సినిమా: సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ కలయికలో వస్తున్న చిత్రం 'శ్రీదేవి శోభ‌న్‌బాబు'. ప్రశాంత్ కుమార్ దిమ్మల ద‌ర్శక‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్రసాద్ నిర్మించిన మూవీ ఫిబ్రవ‌రి 18న విడుదల కానుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడిన సుస్మిత.. 'ఈ చిత్రం నా మనసుకు ద‌గ్గరైంది. చిన్న ఆలోచ‌న‌తో ప్రారంభ‌మైన ప్రాజెక్ట్‌ను అందరం మ‌న‌సు పెట్టి ప‌నిచేశాం. ఇన్నోసెంట్ ఎమోష‌న్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరించి బిగ్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా' అన్నారు.

ఇక ఆడియోన్స్ ఈ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారని విష్ణు ప్రసాద్ చెప్పగా.. 1970 నేప‌థ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ ట్రిబ్యూట్‌లాంటి సినిమా ఆడియెన్స్‌కు ఓ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందన్నాడు సంతోష్ శోభ‌న్. చివరగా దర్శకుడు ప్రశాంత్ కుమార్‌తోపాటు శ‌ర‌ణ్య పొట్ల, జి.కిషన్, శ‌శి మాట్లాడుతూ చ‌క్కగా ప్లానింగ్ చేసుకుని తీసిన మూవీ అంద‌రికీ న‌చ్చుతుందంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.



Next Story